కాంగ్రెస్ భేటీ.. టార్గెట్ మోడీ.!!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది అవిశ్వాస తీర్మానమే.. టీడీపీ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం, స్పీకర్ శుక్రవారం చర్చకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.. అయితే అవిశ్వాసానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.. ఇప్పటికే 'సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారు' అంటూ ధీమా వ్యక్తం చేసిన సోనియా గాంధీ, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

 

 

ఈరోజు సోనియా, కాంగ్రెస్ ఎంపీలతో భేటీ కానున్నారు.. వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, అందర్నీ ఏకతాటిపైకి తేవడం, లోక్‌సభలో చర్చ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.. నిజానికి కేంద్రంలో మోదీ సర్కారు తిరుగులేని మెజారిటీని కలిగి ఉంది.. పేరుకు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కానీ, నెగ్గుతుందన్న ఆశ కాంగ్రెస్ లో లేదు.. మరి కాంగ్రెస్ అవిశ్వాసాన్ని ఎందుకింత సీరియస్ గా తీసుకుందంటే, దాని వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది.. అవిశ్వాసం ద్వారా ప్రాంతీయ పార్టీల్లో మోడీకి అసలైన మిత్రులెవరో, శత్రువులెవరో తెలిసే అవకాశం ఉంది.. దీన్ని బట్టి కాంగ్రెస్ వచ్చే ఎన్నికల వ్యూహాలు రచించాలని చూస్తోంది.. చూద్దాం ఏం జరుగుతుందో.