సోనియా గాంధీకి అస్వస్థత

 

Sonia Gandhi hospitalised, Sonia Gandhi taken ill in Lok Sabha

 

 

 

సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆహార భద్రత బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరిగే సమయంలో ఛాతి నొప్పితో ఇబ్బంది పడుతూ..తీవ్రమైన అలసటకు గురయ్యారు. కేంద్ర మంత్రి సెల్జా, కుమారుడు రాహుల్‌గాంధీ తోడు రాగా సభ నుంచి బయటికి నడిచారు. వెంటనే ఆమె 'ఎయిమ్స్' ఆస్పత్రికి వెళ్లారు. సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు, నేతలు ఆసుపత్రికి వెళ్లి సోనియా ఆరోగ్యంపై వాకబు చేశారు.