TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోనియాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

Published on: Wed May 13, 2026 12:42PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ   అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను గురుగ్రామ్‌లోని   ఆస్పత్రికి తరలించారు.   ఈ సమయంలో ఆమె వెంట.. కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా వాద్రాగాంధీ ఉన్నారు.

కాగా  సోనియాగాంధీ  ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం   నిలకడగా ఉందని చెబుతున్నారు.  వైద్యుల బృందం ఆమె పరిస్థితిని సమీక్షిస్తూ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.  కాగా ఇటీవల కాలంలో సోనియాగాంధీ పలుమార్లు  ఆరోగ్య సమస్యలతో బాధపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో  ఆమె  ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో  చేరి చికిత్స పొందారు. కాగా సోనియాగాంధీ అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి.