నేను అనుకున్నట్టే జరిగింది.. సోనియా కంటతడి...

 

ఏఐసీసీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఎప్పుడూ సైలెంట్ గా సీరియస్ గానే కనిపిస్తారు. కానీ ఓ విషయంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇంతకీ ఏ విషయం అనుకుంటున్నారా..? తన భర్త రాజీవ్ గాంధీ విషయంలో. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..త‌న భ‌ర్త‌ను గుర్తు తెచ్చుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న అత్త ఇందిరా గాంధీ హత్య అనంత‌రం త‌న భ‌ర్త రాజీవ్ గాంధీ రాజ‌కీయాల్లోకి రావ‌డం అనివార్య‌మైంద‌ని.. అయితే నాకు ఆయన రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టంలేదు.. ఎందుకంటే.. మా అత్తగారు లాగానే.. ఆయ‌న‌ కూడా కుటుంబానికి దూరమవుతారని భయమేసింది...అందుకే రాజ‌కీయాల్లోకి రావ‌ద్ద‌న్నాన‌ు.. అలా అనడం నా స్వార్థమే కావచ్చు.. ఎప్పుడూ ఆయనను హ‌త్య చేస్తార‌నే భ‌యం త‌నలో ఉండేదని, చివరికి భయపడిన‌ట్లు జరిగిందని చెప్పి సోనియా గాంధీ క‌న్నీరు పెట్టుకున్నారు. కాగా రాజీవ్‌ గాంధీని 1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే.