మనం రక్తాన్ని చిందించాం.. భయపడేది లేదు.. సోనియా

 

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నుండి పార్లమెంట్ వరకూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘సేవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. మానవతా విలువల పరిరక్షణ కోసం మనం రక్తాన్ని చిందించామని.. అటువంటి మనల్ని భయపెట్టడానికీ, అప్రదిష్టపాలు చేయడానికి ఈ రోజు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సోనియా విమర్శించారు. ఎవరెంత ప్రయత్నించినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

 

 

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిర పరచడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. ప్రజాస్వమ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడం ద్వారా మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు.