సోనియా అబద్దం చెపుతుంది

 

రాష్ట్రవిభజన నేపధ్యంలో ఎంపి సాయిప్రతాప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం, సోనియా అందరికి చెప్పి నిర్ణయం తీసుకున్నమనటం అబద్దం అన్నారు సాయిప్రతాప్‌. నవ్వుతూనే మాట్లాడి మమ్మల్ని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేసే దుస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.

విభజన పై నిర్ణయం తీసుకుంటున్నామని అసలెవరికి చెప్పారో కూడా తెలియదన్నారు. తనతో పాటు సీమాంద్ర ఎంపిలు మంత్రులు అందరు చివరి వరకూ సమైక్యాంధ్ర డిమాండ్‌నే వినిపించామని చెప్పారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసి మరీ చెబుతానని.. తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర తెలంగాణ విషయంలో ఎంత ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన అది జరగదని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదన్నారు. శిక్షపడ్డ ప్రజాప్రతినిధులను కాపాడేందుకు కేబినెట్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించి పారేయాలని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు.. ఎనిమిది కోట్ల మంది ఐక్యతను కాపాడేందుకు తెలంగాణ పై కేబినెట్ నోట్‌ను ఎందుకు చించే యకూడదని సాయిప్రతాప్ ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని రాహుల్‌ వ్యతిరేఖించినప్పుడు తాము వ్యతిరేకించటంలో తప్పేముందని ప్రశ్నించారు.