ప్రజలు కోరితే ఎన్నికల్లో పోటీ ప్రియాంక గాంధీ భర్త
Published on: Tue Feb 7, 2012 9:38AM
అ
మేథీ: సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంపై విస్తృతమైన చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె భర్త రాబర్ట్ వద్రా రాజకీయ రంగ ప్రవేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి రావడానికి తాను వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. అమేథీలో ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం సాగిస్తున్న క్రమంలో సోమవారం ఆయన అలా మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రజలు కోరితే తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి తన కుటుంబ సభ్యులకు తాను సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.


