మహేష్ తో 'శివం' చేస్తున్న సోనాక్షి సిన్హా
Published on: Mon Jun 24, 2013 3:30PM

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తో బాలీవుడ్ రౌడీ గర్ల్ సోనాక్షి సిన్హా 'శివం' సినిమా చేస్తుందని గత౦లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సోనాక్షి శివం సినిమా గురించి మీడియాతో మాట్లాడింది... ''క్రిష్ శివం సినిమా స్టోరీ చెప్పగానే ఎంతో ఉద్వేగభరితంగా అనిపించింది. క్రిష్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు బాలీవుడ్ లో బిజీ గా ఉన్నాను..ఇప్పుడు తెలుగు లో సినిమా చేయలేను అని వినయంగా తిరస్కరిద్దామనుకున్నాను. కథ విన్నాక ఉత్కంఠను ఆపుకోలేకపోయాను. నేను చేసిన పాత్రలన్నీటికంటే..శివం లో చేస్తున్న పాత్ర నాకు మంచి పేరు వస్తుందని'' చెప్పింది సోనాక్షి. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళుతు౦దానెది చెప్పలేదు.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1 నేనొక్కడినే' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల తో 'ఆగడు' సినిమా చేయనున్నాడు. ఆ తరువాత 'శివం' చేస్తారని సమాచారం.


