Latest News
గోవాలో సూర్యతో సోనాక్షి రొమాన్స్...!
posted on: Jan 9, 2014 2:27PM

సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులోని ఓ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆడిపాడనుంది. సూర్య, సోనాక్షిలు కలిసి చిందులేయనున్న ఈ పాటను త్వరలోనే గోవాలో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest YouTube Trending Video NEWS






