TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్షణికావేశంలో కన్నతల్లినే కడతేర్చిన కర్కోటక కొడుకు

Published on: Mon Jun 22, 2026 2:12PM

క్షణికావేశంలో కన్నతల్లినే దారుణంగా హత్య చేసిన కర్కోటక కుమారుడి ఉదంతమింది.  కాకినాడ జిల్లా పో చిత్రాడ గ్రామం  ఈబీసీ కాలనీలో 45 ఏళ్ల వయసున్న నాగమణి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. నాగమణి   కొడుకు ఈ నెల 9న   భోజనం సమయంలో  చల్లటి మంచినీళ్లు ఇవ్వాలని తల్లి నాగమణికి చెప్పాడు. అయితే..  నాగమణి వంటింట్లో వేరే పనిలో  ఉన్న ఆమె కొడుకు అడిగినట్లుగా ఫ్రిజ్ లో నుంచి చల్లటి మంచినీళ్లు తెచ్చి ఇచ్చే విషయంలో కొంత ఆలస్యం చేసింది.  

  ఈ చిన్నజాప్యాన్ని సహించలేని రాజబాబు కోపంతో విచక్షణ  కోల్పోయిన రాజబాబు తల్లి నాగమణిపై దాడి చేశాడు.  పూజగదిలో ఉన్న  చెక్క బల్లకు అమె తలను గట్టిగా కొట్టాడు.  దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.  అయినా కొడుకు రాజబాబు ఆమెను పట్టించుకోలేదు. కొద్ది సేపటి తరువాత నాగమణి భర్త త్రిమూర్తులు   ఇంటికి వచ్చి..  రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న నాగమణికి  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆనాటి నుంచీ.. అంటే.. జూన్ 9 నుంచి కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న నాగమణి..  ఆదివారం (జూన్ 21) కన్నుమూసింది.  ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన రాజబాబుపై చట్టపరమైన దర్యాప్తు జరుపుతున్నారు.