మా పాతివ్రత్యాన్ని నిరూపించండి ప్లీజ్....

 

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఒకడు.. అలా ఉంది బీజేపీ పరిస్థితి చూడబోతే. పవన్ జేఏసీ ఏర్పాటు చేసిందీ లేదు..పెట్టింది లేదు ఇంకా.. అప్పుడే ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ సలహాలు ఇచ్చిన ఘనుడు ఎవరనుకుంటున్నారా..? సమయం సందర్భం లేకుండా ఏ పరిస్థితిలో దేని గురించి మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు.

 

రెండు రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జేఏసీ ఏర్పాటు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. ప్రత్యేక హోదా కోసం కూడా పార్టీలన్నీ కలిసి పనిచేయోచ్చు...అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి..జనసేన గొంతు ఒక్కటే సరిపోవడం లేదు.. ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణ లాంటి ఇతర మేధావులందరితో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేయలని భావిస్తున్నా... జేఏసీ ఏర్పాటుపై ఉండవల్లి, జేపీని కలిసి చర్చిస్తా అని. చెప్పాడు. దీనిలో భాగంగానే నిన్న పవన్ జేసీని కలవడం జరిగింది. వారిద్దరూ కొంచంసేపు ఏపీ సమస్యలపై పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జేపీ పవన్ ఏరి కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడని బహిరంగంగానే అన్నారు. ఇక ఉండవల్లి అయితే ఈ జేఏసీ ఏర్పాటుపై స్పందించి ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ తనకి అంత ఇంట్రస్ట్ లేదన్న విషయం అయితే అర్ధమయిపోతుంది.

 

ఈ నేపథ్యంలో ఈ జేఏసీ ఏర్పాటు ఎంత వరకూ సక్సెస్ అవుతుందో కూడా చెప్పలేం. కానీ రాజు గారు మాత్రం అప్పుడే దీనిపై స్పందించి సలహాలు ఇచ్చేస్తున్నారు. జేఏసీ పెట్టే ముందు జేపీ, పవన్ ఢిల్లీ వెళ్లాలట. అంతేకాదు కేంద్రం వద్ద అపాయింట్ మెంట్ తీసుకుని వీరికున్న డౌట్లను అడిగి క్లియర్ చేసుకొని... ఏపీకి ఏమేమి ఇచ్చారో నోట్సు రాసుకోవాలట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ మాట నిజమో, బీజేపీ మాట నిజమో ప్రజలకు చెప్పాలట. మరి ఏం ఇచ్చారో మీకే చెప్పడం చేతకానప్పుడు మీరు ఏం చేశారు.. ఎమిచ్చారో చెప్పడానికి పక్క పార్టీలు నోట్లు రాసుకొని మరీ చెప్పాలా ఖర్మ కాకపోతే. రాష్ట్రానికి ఏం ఇచ్చారో మీరు చెప్పరు.. ఏం కావాలో చంద్రబాబు నివేదిక ఇస్తే దానికి దిక్కుండదు.. మళ్లీ ఉచిత సలహాలు ఒకటి. బీజేపీ తీరు చూస్తుంటే... ఒకరు పాతివ్రత్యాన్ని ఇంకొకరు నిరూపించమన్నట్టు ఉంది. ఇంక జేఏసీ ఏర్పాటైతే ఇంకెన్నిసలహాలు ఇస్తారో మరి...