మరోసారి ప్రభుత్వంపై రాజుగారి విమర్శలు..


బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని, బుల్డోజర్ కావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.27 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని, చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని, పట్టిసీమ ఎత్తిపోతలలో ఉన్న మెకానిజం ఏంటి? స్పిల్ వేలో రూ.1400 కోట్ల ఖర్చు ఎందుకు అయిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతికి ‘పట్టిసీమ’ పరాకాష్ట అని, రూ.1120 కోట్లతో ‘పట్టిసీమ’ మొదలైందని, ఇప్పుడు రూ.1667 కోట్లకు వెళ్లిందని అన్నారు. పట్టిసీమలో ఏర్పాటు చేసిన మోటార్లు 30 అని చెప్పారని, కేవలం 24 మోటార్లు మాత్రమే పెట్టారని, పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉందని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ కు 20 అవార్డులు వచ్చాయి కానీ, ఆయనకు సంబంధించిన శాఖలో అవినీతికి హద్దు లేదని అన్నారు.