మరోసారి టీడీపీపై వీర్రాజు... పనికిమాలిన పదవి ఇచ్చారు..
Published on: Wed Feb 28, 2018 10:21AM

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దికాలంగా టీడీపీపై, పార్టీ నేతలపై, ఆఖరికి పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సోము వీర్రాజు.. తాజాగా మరోసారి రెండు పార్టీల పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకే నష్టం కలిగిందని... దేనికీ ఉపయోగపడని, ఓ పనికిమాలిన ఎమ్మెల్సీ పదవిని తనకు ఇచ్చి.... తనకేదో భిక్ష వేశామన్నట్టుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని... లక్షలాది ఉద్యోగాలు రానున్నాయని టీడీపీ నేతలు బీరాలు పలుకుతున్నారని... అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకని ఆయన ప్రశ్నించారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి...


