టీడీపీపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు...చంద్రబాబుపై కూడా

 

బీజేపీ పెద్దలు ఎంత కంట్రోల్ లో ఉండమని చెబుతున్నా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం తన నోటిని కంట్రోల్ చేసుకోవడంలేదు. మరోసారి టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  కర్నూలులో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... తాము నిప్పులాంటి వాళ్లమని, టీడీపీ నేతలు అవినీతికి వారసులని, రాష్ట్రంలో ఓ మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా. నాకు సొంత ఎజెండా లేదు. రాష్ట్రంలో రూలింగ్ లేదు.. ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ’ని సీఎం చంద్రబాబుపైనా పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని ఆరోపించారు.