కేసీఆర్ తెల్లవారుజాము దాకా తాగుతడు! కేటీఆర్ కు సోము వీర్రాజు కౌంటర్..
Published on: Fri Dec 31, 2021 2:11PM
చీప్ లిక్కర్ పై సోము వీర్రాజు చేసిన ప్రకటనపై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. సోము వీర్రాజును ఏపీతో తెలంగాణ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అయితే తనను విమర్శిస్తూ ట్వీట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ పై ఖతర్నాక్ కౌంటరిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ‘నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు?.. నేను సారాయి వీర్రాజును కాదు.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును... కోడిగుడ్ల వీర్రాజును’ అని చెప్పారు.
పేదవాడిని దృష్టిలో పెట్టుకునే లిక్కర్‌పై మాట్లాడానని వివరించారు సోము వీర్రాజు. రూ.50కి లిక్కర్ అమ్మితే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయని అన్నారు. తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024 బీజేపీ మేనిఫెస్టోలో పెడతామని స్పష్టం చేశారు. ఏపీలోని ప్రతి సమస్యకు బీజేపీ దగ్గర పరిష్కారం ఉందన్నారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రి పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరు?.. వెంటనే ఆ పేరును మార్చాలన్నారు. లేకుంటే 2024 అధికారంలోకి వచ్చాక తామే మారుస్తామన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న పేరును బీజేపీ ప్రతిపాదిస్తోందని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు.


