విహెచ్ పై దాడిని ఖండించిన సోమిరెడ్డి

Publish Date:Aug 17, 2013

Advertisement

 

 

 

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుపై తిరుమలలోని అలిపిరి వద్ద సమైక్యవాదులు దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. దాడులు తమ సంస్కృతి కాదని హరీష్‌రావు అంటున్నారని, అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిందెవరని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో దళిత ఉద్యోగిపై హరీష్‌రావు దాడి చేయలేదా అని అడిగారు. తెరెస, బిజెపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. సమైక్య ఉద్యమం కుట్రపూరితమైనదని విహెచ్ రెచ్చగొట్టడం సబబుకాదని సోమిరెడ్డి అన్నారు.