సమీక్ష జరుపుతా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా

 

ఓ వైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు అధికారికంగా సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు, ఫిర్యాదులు.. మరోవైపు సమీక్షలపై ఈసీ ఆంక్షలు. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గడువు ముగియలేదని, సీఎం సమీక్షలు జరిపితే తప్పేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి, వైసీపీకి ఆయన సవాల్ విసిరారు. నాలుగు రోజుల్లో వ్యవసాయ శాఖపై సమీక్ష చేస్తా? ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. ఎవరైనా తన సమీక్షను అడ్డుకొంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. సీఎం మంత్రులు ఇంట్లో కూర్చోవాలా ? అంటూ ఆయన మండిపడ్డారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోం.. కానీ, పరిపాలించడం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సోమిరెడ్డి అన్నారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోవడానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా బాధ్యత వహించేది? ఈసీనా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థుల మరణాలకు టీఎస్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.