TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్.. ఆయ‌నెవ‌రో తెలుసా?

Published on: Thu Jan 13, 2022 3:01PM

ఇస్రో చైర్మ‌న్ కె.శివ‌న్‌. చంద్ర‌యాన్‌-2 లాండ‌ర్ విఫ‌లం త‌ర్వాత‌.. పీఎం మోదీని ప‌ట్టుకొని వెక్కివెక్కి ఏడ్చిన వాడిన అంద‌రికీ గుర్తే ఉంటుంది. ఇస్రో చైర్మ‌న్‌గా శివ‌న్ ప‌ద‌వీకాలం జ‌న‌వ‌రి 14తో ముగియ‌నుంది. ఆయ‌న త‌ర్వాత ఆ స్థానంలో కొత్త చైర్మ‌న్‌గా ఎస్‌.సోమ‌నాథ్ నియ‌మితుల‌య్యారు. 

ఇస్రోకి పదో చైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్ (డీవోఎస్‌) కార్యదర్శిగా సోమనాథ్‌ను నియమిస్తూ  నిర్ణయం తీసుకుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

సీనియర్ సైంటిస్ట్‌, రాకెట్‌ ఇంజనీరింగ్‌, లాంచింగ్‌ వెహికిల్స్‌ డిజైనింగ్‌లో నిపుణులు సోమనాథ్‌. ఆయ‌న 2018 నుంచి విక్రమ్‌ సారాబాయి స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆయన రెండున్నరేళ్లపాటు లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా, అత్యుత్త‌మ ఇస్రో చైర్మ‌న్‌గా ప‌ద‌వి పొందారు.

సోమ‌నాథ్‌ కేరళలోని టీకేఎం కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (కొల్లాం)లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ (ఐఐఎస్‌సీ) నుంచి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ గోల్డ్‌ మెడల్‌ సాధించారు.