సొమాలియాలో ఉగ్రదాడి.. 60 మంది సైనికులు మృతి
Published on: Fri Jan 15, 2016 3:34PM

ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిన్న ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అది మర్చిపోకముందే మళ్లీ ఉగ్రవాదులు ఆఫ్రికా యూనియన్ సైనిక స్థావరంపై దాడి జరిపారు. అల్ షబాబ్ తీవ్రవాదులు ఆఫ్రికా యూనియన్ సైనిక స్థావరంపై దాడి జరుపగా దాదాపు 60 మంది సొమాలియా సైనికులు మృతిచెందారు. దక్షిణ సొమాలియాలోని ఎల్ అబేద్ క్యాంపుపై మిలిటెంట్లు దాడి చేసి క్యాంపు కేంద్రాన్ని సంపూర్ణంగా ఆధీనంలోకి తీసుకున్నట్లు అల్ షబాబ్ సంస్థ ప్రకటించింది.


