TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సౌర విద్యుత్‌కూ సాకులేనేమో !?

Published on: Fri Sep 28, 2012 7:34AM

Solar Electricity, Electricity Generating Plants, Coal, Water, Solar Electricity Generating Spares,

 

రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు, పరికరాల తయారీ యూనిట్లను ప్రోత్సహించడానికి సంబంధించిన ఉత్తర్వులను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. గ్రిడ్‌తో సంబంధం లేకుండా సొంత అవసరాలకు సౌర విద్యుత్‌నుఉపయోగించుకునేలా, విద్యుత్‌ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడానికి వికేంద్రీకృత, పంపిణీ ఉత్పత్తి పద్ధతిని ప్రోత్సహించాలన్న లక్ష్యాలను ఈ విధానంలో నిర్ణయించారు. ఇది 2017వరకు అమల్లో ఉంటుంది. అంటే భవిష్యత్‌ భారతం అంతా సౌర విద్యుత్‌దే. చాలా సంతోషం ఉంటుంది. అయితే అప్పుడు బొగ్గని, నీరంటూ సాకులు దొరకవు. అంతా సౌర విద్యుత్తే! అందువల్ల పరికరాలకు సంబంధించిన సాకులు మాత్రమే చెప్పగలుగుతారు. ఈ నేపథ్యంలోనే సామాన్యుడికొక సందేహం! సౌర విద్యుత్‌కు కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, సూర్యుడి వేడికి పరికరాలు పాడైపోతున్నాయి... ఈ నెలరోజులు ఎండ బాగా రాలేదు కనుక విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నాం అంటూ వడ్డింపులు మొదలెడతారేమోనన్న భయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే మనకున్న నేతలు, పారిశ్రామికవేత్తలు దేనికైనా సమర్ధులు ! స్పాంటేనియస్‌గా సాకులు చెప్పగల నిష్ణాతులు...!