TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

"OYO"లో క‌లుద్దామా.. నేను అలాంటిదాన్ని కాదు సార్‌...

Published on: Tue Aug 31, 2021 4:48PM

సాఫ్ట్‌వేర్ జాబులు చాలా సాఫ్ట్‌గా ఉంటాయ‌నేది ఓ భ్ర‌మే. అక్క‌డా కంటికి క‌నిపించ‌ని రాజ‌కీయాలు ఫుల్లుగా ఉంటాయి. అక్క‌డా కుల‌, మ‌త తేడాలుంటాయి. అక్కడా బాసుల రూపంలో దాగున్న తోడేళ్లు ఉంటాయి. త‌మ టీమ్‌లో అంద‌మైన అమ్మాయి ఉంటే చాలు.. కామా*ధులు క‌ళ్ల‌తోనే కుళ్ల‌బొడుస్తుంటారు. కొలీగ్స్ కొంత‌వ‌ర‌కు ఓకే అయినా.. టీమ్ లీడ్స్, మేనేజ‌ర్స్‌తోనే అస‌లైన ప్రాబ్ల‌మ్‌. అంద‌రూ అలా అని కాదు.. చాలామందే అలా ఉంటార‌ని చెబుతున్నారు పోలీసులు. జ‌స్ట్ చెప్ప‌డ‌మే కాదు.. ఇటీవ‌ల సైబ‌రాబాద్ షీ టీమ్స్ డీల్ చేసిన ఓ కేసును అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. ఆ కేస్ తాలూకా ఓ వాట్సాప్ చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి బాస్‌ల రూపంలో ఉండే శాడిస్టుల‌కు అస్స‌లు భ‌య‌ప‌డ‌కుండా ఉండ‌మంటూ.. ఎలాంటి ఎక్స్‌ట్రాలు చేసినా తోక క‌ట్ చేసేందుకు మేమున్నామంటూ అభ‌య‌మిస్తోంది షీ టీమ్‌. ఇంత‌కీ ఆ వాట్సాప్ చాట్‌లో ఏముందంటే.... 

బాస్ నుంచి అమెకు మెసేజ్ వ‌చ్చింది. నీ ప్రాజెక్ట్ ప‌ర్‌ఫార్మెన్స్ బాగా లేద‌ని మొద‌ట భ‌య‌పెట్టాడు. అయినా, ఓకే నేను చూసుకుంటా.. శాల‌రీ హైక్ వ‌చ్చేలా చేస్తా.. కానీ...... అంటూ మెసేజ్ పెట్టాడు. కానీ.. ఏంటి సార్ అని ఆమె అడిగితే.. ఓయో రూమ్స్‌లో క‌లుద్దామా అంటూ అస‌లు మేట‌ర్ రివీల్ చేశాడు. తాను అలాంటి దాన్ని కాదంటే.. బ్లాక్ మెయిల్‌కు దిగాడు. హైక్ ఉండ‌దు.. ఉద్యోగం ఉండ‌దు.. కెరీర్ ఉండ‌దు.. అంటూ బెదిరించాడు. ఆ యువ‌తి ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే షీ టీమ్స్‌కు కంప్లైంట్ చేసింది. వెంట‌నే కాప్స్ ఆ కంత్రీ బాస్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బాస్ ఉద్యోగ‌మే ఊడింది. ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింప‌డానికి.. ఆ వాట్సాప్ చాట్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్.

ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పేరుతో ఏర్పాటైన ప్రత్యేక విభాగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది. మహిళలు, టీనేజ్ యువతులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆటకట్టించేందుకు షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే సోషల్ మీడియా పెరిగిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వేధింపులపై ఎలా స్పందించాలి?.. ఆ విషయంపై పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి? అనే దానిపై ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ సరికొత్తగా అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా ఈ వాట్సాప్ చాటింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇంత‌కీ ఆ లేడీ ఎంప్లాయ్ త‌న బాస్ ఫోన్ నెంబ‌ర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా... డైనో"సార్‌"...