TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మియాపూర్‌లో వివాహిత దారుణ హత్య!

Published on: Tue Oct 1, 2024 7:06AM

మియాపూర్‌లో ఓ వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ 3ఏ బ్లాక్‌లో ఉండే ప్రైవేట్ పాఠశాల టీచర్ నమ్రత కుమార్తె బండి స్పందన (29) సాఫ్ట్.వేర్ ఉద్యోగి. ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ని ప్రేమించింది. 2022 ఆగస్టులో పెద్దల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. 2023లో భర్త తనను వేధిస్తున్నాడంటూ స్పందన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ఆమె విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. సోమవారం స్పందన తల్లి తాను పనిచేస్తున్న స్కూలుకు వెళ్లగా స్పందన ఇంట్లో ఉంది. సాయంత్రం స్కూలు నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్ నొక్కినా, కుమార్తె ఫోన్‌కి కాల్ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే స్పందన హత్యకు గురై ఉంది. ఆమెను పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. అనుమానం వున్న అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.