TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భవ్యశ్రీ ఆచూకీ దొరికింది... కుటుంబానికి అప్పగింత

Published on: Sun Oct 12, 2014 2:12PM

 

ఈనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకినీ పోలీసులు కనుగొన్నారు. ఆమెను తన కుటుంబ సభ్యలకు అప్పగించారు. భవ్యశ్రీ కనిపించకుండా పోయినప్పటి నుంచి పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఆమె విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించారు. వైజాగ్‌ నుంచి ఆమెను హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు భవ్యశ్రీ చరితను సురక్షితంగా అప్పగించారు.