TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య

Published on: Fri Jun 12, 2026 9:25PM

 

హైదరాబాద్ గోల్కొండలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. సాధారణంగా ప్రార్థనలు ముగించుకుని ప్రశాంతంగా ఇంటికి చేరుకున్న ఓ యువకుడికి తన ఇంట్లోనే చివరి క్షణాలు ఎదురవుతాయని ఎవరూ ఊహించలేదు. కుమార్వాడి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల చాంది మాసూద్ అలియాస్ షైక్ మాసూద్ శుక్రవారం నమాజ్ ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అయితే అతడిని కొందరు వ్యక్తులు వెంబడిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరిస్థితిని గమనించిన మాసూద్ ప్రాణభయంతో ఇంట్లోకి పరుగెత్తి వెళ్లినట్లు సమాచారం.కానీ అక్కడితో ప్రమాదం ఆగలేదు. వెంటా డుతూ వచ్చిన వ్యక్తులు ఇంటి గుమ్మం దాటి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. 

అనంతరం ఇంట్లోనే తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. డంబెల్ రాడ్లతో దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మాసూద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఒక్కసారిగా ప్రాంతమంతా కేకలు, ఆందోళనలతో మార్మోగిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొద్దిసేపటి క్రితం వరకు అందరితో మాట్లాడిన యువకుడు క్షణాల్లో శవంగా మారిపోవడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కుటుంబ విభేదాలే కారణమా? పాత గొడవ లేమైనా ఉన్నాయా? లేక మరేదైనా కారణం దాగి ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ ఘటనలో సొంత బామ్మర్దులే హత్య చేసినట్లు సమాచారం.. ప్రస్తుతం గోల్కొండలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చిన ఓ యువకుడు క్షణాల్లో హత్యకు గురవడం స్థానికులను కలచివేస్తోంది.