నడి రోడ్డుపై తాచుపాము.. స్తంభించిన ట్రాఫిక్
Published on: Wed Nov 9, 2022 4:54AM
ఉమ్మడి ప్రకాశం జిల్లా డోర్నాల-మార్కాపురం ప్రధాన రహదారిపై దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇందుకు ఆ రోడ్డుపై యాక్సిడెంట్ జరగడమో, రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడమో, ఏదైనా వాహనం మరమ్మతు కోసం నిలిచిపోవడమో కాదు. ఒక పాము.
నడిరోడ్డుపై పాము పడగవిప్పి దర్శనమిచ్చింది. వాహనాల లైట్లు, హారన్ల మోతతో బెంబేలెత్తిన ఆ పాము నడిరోడ్డుపై పడగ విప్పి అలా ఉండిపోయింది. దీంతో రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి.
ఎవరూ ముందుకు కదలడానికి ధైర్యం చేయలేదు. అలాగే పాము వెళ్లే వరకూ వాహనదారులు ఆగిపోయారు. చివరికి ఆ పాము అరగంట తరువాత నెమ్మదిగా రోడ్డు పక్కనున్న పొలాలలోకి వెళ్లిపోయింది. ఆ తరువాతే ఆ రోడ్డు పై ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.


