దుర్గగుడిలో జంట నాగులు.. ఓ పాముకు దహన సంస్కారాలు
Published on: Sat Dec 18, 2021 3:59PM
బెజవాడ దుర్గమ్మ. భక్తుల పాలిట కొంగు బంగారం. మహిమాన్వితం ఇంద్రకీలాద్రి పర్వతం. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కొండపై.. కొంతకాలంగా రెండు సర్పాలు సంచరిస్తుండటం ఆసక్తికరం. అర్చకులకు, భక్తులకు తరుచూ ఆ పాములు దర్శనమిస్తున్నాయి. ఇటీవల అంతరాలయంలో ఓ పాము కనిపించి మాయమైంది. కొండపై తిరుగుతున్న రెండు పాములను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు.
తాజాగా, కొండపై ఓ టర్నింగ్ దగ్గర ఒక పాము చనిపోయి ఉంది. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికీ అంతిమ కార్యక్రమాలు చేయాలని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు చెబుతున్నారు. అందుకే, మనుషుల మాదిరిగానే.. దుర్గాఘాట్‌లో పాముకు దహన సంస్కారాలు చేశారు వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు. అయితే, జంట సర్పాల్లో ఓ పాము చనిపోవడంతో ఏదైనా కీడు జరుగుతుందా అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


