పాముకాటు: తండ్రీకూతుళ్ళ మృతి
Published on: Tue Jul 29, 2014 12:16PM
.jpg)
కుటుంబమంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పాము తండ్రి, కూతుర్ని కాటేసి వెళ్ళిపోయింది. వారిద్దరూ పాము కాటుకు గురైన విషయాన్ని నిద్రలో వున్న కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు. హుటాహుటిన వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి వారిద్దరూ ఆస్పత్రిలో మరణించారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో తండ్రి అన్నం గంగాధర్ (45), కుమార్తె సౌందర్య (18) మరణించారు. తండ్రీకూతుళ్ళను చంపిన పాము కోసం ఇంటి పరిసరాల్లో వెతికినా కనిపించలేదు.


