కోహ్లీ, స్మృతి ఇద్దరూ 18నే.. తగ్గేదే లే!

posted on: Dec 13, 2022 2:23PM

క్రికెట్ అనగానే ప్రపంచంలో ఆ క్రీడను అభిమానించే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీని అభిమానించే క్రికెట్ ప్రేమికులు ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నిటిలో ఉన్నారు. ముఖ్యంగా ఛేజింగ్ లో కోహ్లీలోని బెస్ట్ క్రికెటర్ బయటకు వస్తాడు.

అంటే ప్రత్యర్థులు నిర్దేశించే విజయ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపుతాడు.  ముఖ్యంగా పొట్టి క్రికెట్ లో కోహ్లీ ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. టి 20లలో అత్యధిక పరుగులు, హయ్యస్ట్ నంబర్ ఆప్ హాఫ్ సెంచరీలు, అత్యుత్తమ సగటు ఇలా దాదాపు రికార్డులన్నీ కోహ్లీ పేరునే ఉన్నాయి.

అయితే అలాంటి ఘనత సాధించిన ఇండియన్ బ్యాటర్ మరొకరు ఉన్నారు. ఔను నిజమే టి20లో కోహ్లీతో సాటి రాగల క్రికెటర్ మరొకరున్నారు. అయితే పురుషుల క్రికెట్ లో కాదు. మహిళల క్రికెట్ లో ఆమె పేరు స్మృతి మందాన.

మహిళల పొట్టి క్రికెట్ లో రికార్డులన్నీ స్మృతి మదాన పేరునే ఉన్నాయి. ముఖ్యంగా ఛేజింగ్ లో ఆమె బ్యాటింగ్ లెవెలే వేరు. విశేషమేమిటంటే కోహ్లీ జెర్సీ నంబర్ 18 అయితే స్మృతి జెర్సీ నంబర్ కూడా 18. ఇద్దరికీ బ్యాటింగ్ స్టైల్ నుంచి జెర్సీ నంబర్ వరకూ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...