స్మృతీ ఇరానీకి మద్దతుగా 600 మంది ఉపాధ్యాయుల లేఖ
Published on: Sat Mar 12, 2016 2:22PM
.jpg)
అన్నివైపులా విమర్శలను ఎదుర్కొంటున్న మానవ వనరులశాఖ మంత్రి స్మృతీ ఇరానీకి సంతోషం కలిగించే వార్త ఇది. దిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నా దాదాపు 600 మంది ఉపాధ్యాయులు జేఎన్‌యూలో జరిగిన ఘటనను ఖండిస్తూ ఆమెకు ఓ లేఖను రాశారు. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన సంఘటన నిజంగానే దేశవ్యతిరేక చర్య అని వారంతా ముక్తకంఠంతో తమ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఉన్న వివిధ సంస్థలు విద్యార్థులలో అలజడిని రేకెత్తించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయనీ, భావప్రకటన స్వేచ్ఛ అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదనీ... వారు తమ లేఖలో తెలిపారు. కన్నయాకుమార్‌కు కూడా ఈ లేఖలు కాస్త చురకలు అంటించారు సదరు ఉపాధ్యాయులు. ‘రాజ్యాంగం అందించిన హక్కులను అనుభవిస్తున్నవారే, అందుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని’ దుమ్మెత్తిపోశారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనకి విద్యార్థులలోనూ, ఉపాధ్యాయులలోనూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని వారన్నారు.


