స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్..కర్మణ్యే వాధికారస్తే

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ ఎక్స్‌లో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం  ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ట్వీట్టర్ వేదికగా స్మితా  స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. "పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన టూరిస్ట్ ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది" అని ఆమె వివరించారు. తెలంగాణలో తొలిసారిగా, 2025-30 టూరిజం పాలసీ తీసుకొచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్షించబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది అవుతుంది.

 శాఖ పనితీరును మళ్లీ ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను. ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళికా మౌలికతల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉంది’ అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పర్యాటక శాఖలో పనిచేయడం గర్వంగా, గౌరవంగా ఉందని నమస్కారం సింబల్ జోడించారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. మీరు టూరిజం లో చాలా మార్పు తీసుకొని వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  ఇటీవల హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News