TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ గా స్మితా సభర్వాల్

Published on: Sun Apr 27, 2025 8:19PM

 

 తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్. వెంకట్ రావు, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఇలంబర్తిలను నియమించారు. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా స‌బర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.