TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పురస్కారం!

Published on: Tue Jun 16, 2026 10:15AM

ప్రధాని నరేంద్ర మోదీకి  అంతర్జాతీయ యవనికపై మరో అరుదైన పురస్కారం లభించింది.   ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న ఆయన  ఇప్పుడు మరో అత్యున్నత అంతర్జాతీయ గౌరవం అందుకున్నారు.   ఐరోపా పర్యటనలో భాగంగా స్లోవేకియా లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది.   భారత ప్రధానమంత్రి స్లోవేకియా దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.   ఈ చారిత్రాత్మక పర్యటన సందర్భంగా స్లోవేకియా ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్  అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది.  స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో   వైభవంగా జరిగిన ఒక  అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

ఈ అంతర్జాతీయ అవార్డు కేవలం విదేశీ పౌరులకు మాత్రమే స్లోవేకియా ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర మరియు సైనిక పురస్కారం కావడం విశేషం.  తనకు ఈ పురస్కారం అందించిన స్లోవేకియా ప్రభుత్వానికీ, ఆ దేశ పౌరలకుప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కేవలం తనకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదని, దీనిని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రపంచ వేదికపై భారతదేశానికి పెరుగుతున్న ప్రతిష్ఠకు, భారత్ మరియు స్లోవేకియా దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహ బంధానికి ఈ అవార్డు ఒక బలమైన ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.