సెహ్వాగ్ బాదుడుతో బోణీ కొట్టిన ఢిల్లీ

Slam-bang Sehwag ends Delhi Daredevils' losing streak in IPL-6, Delhi Daredevils beat Mumbai Indians by   9 wickets, IPL-6 Delhi Daredevils crush Mumbai Indians by 9 wickets

 

వరుస ఓటములతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను దాదాపు వదిలేసుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహవాగ్ రాణించడంతో ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఐపిఎల్-6 లీగ్ మ్యాచేస్ లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ X ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్, డ్వేన్ స్మిత్ (8) వికెట్ ను నాలుగో ఓవర్లో వాండర్ మెర్వ్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్ కు క్యాచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ఫామ్ లో ఉన్న దినేష్ కార్తీక్ క్రీజ్ లోకి వచ్చిన కొంతసేపటికి దినేష్ కార్తీక్ రనౌట్ గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ క్రీజ్ లోకి రావడంతో సచిన్ జత కలిసి జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. అగార్కర్ బౌలింగ్ లో అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్న సచిన్ 54 పరుగులు 47 బంతులు (5 బౌండరీలు 2 సిక్సర్లు) మరుసటి ఓవర్లోనే ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 31 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మ్యాచ్ మొత్తం మీద 43 బంతుల్లో 73పరుగులు (5 బౌండరీలు  5 సిక్సర్లు) నాటౌట్, ఇన్నింగ్స్ చివరి బంతిని పోలార్డ్ 10 బంతుల్లో 19 పరుగులు (1 బౌండరీ 1 సిక్స్)నాటౌట్  సిక్స్ కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్ కు 2, వాండర్ మెర్వ్ 1 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ వార్నర్ కు బదులుగా ఢిల్లీ కెప్టెన్ మహేళ జయవర్థనే వీరేంద్ర సెహ్వాగ్ తో జతకలిసి బరిలోకి దిగాడు. వీరిద్దరూ మొదటి నుంచే మెరుపు ఇన్నింగ్స్ ప్రారంభించారు. మునాఫ్ పటేల్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ లో ఉన్న జస్ప్రీత్ బుమ్రాహ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన క్యాచ్ జారవిడవడంతో ఊపిరి పీల్చుకున్న సెహ్వాగ్ మరి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. జయవర్థనే, సెహ్వాగ్ 97 బంతుల్లో 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జయవర్థనే 43 బంతుల్లో 59 పరుగులు (8 బౌండరీలు 1 సిక్సర్) చేసిన తరువాత మలింగ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయి ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. అప్పటికి గెలవాలంటే కేవలం 11 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. క్రీజ్ లోకి వచ్చిన వార్నర్ 7 నాటౌట్ గా, వీరేంద్ర సెహ్వాగ్ 57 బంతుల్లో 95 పరుగులు (13 బౌండరీలు 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచి 17వ ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 165 చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వీరేంద్ర సెహ్వాగ్ కు దక్కింది.