TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటర్ ఫెయిల్.. ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య

Published on: Mon Apr 13, 2026 8:32AM

తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల పలు చోట్ల విషాదానికి దారి తీసింది. పరీక్షలో ఫెయిలయ్యామనీ, ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదన్న బాధతో, ఆవేదనతో  రాష్ట్ర వ్యాప్తంగా  వేర్వేరు ప్రాంతాలలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.     

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘ టనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన  గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.

 
ప్రతి ఏటా ఫలితాల సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మార్కులే జీవితం కాదన్న విషయాన్ని విద్యార్థులకు అవగాహన కలిగేలా చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లు, విద్యాసంస్థలు తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్షల ఒత్తిడిని జయించేలా విద్యార్థులకు కౌన్సెలింగ్  ఇవ్వాలం టున్నారు.  వైఫల్యాలను ఎదుర్కొని నిలబడేలా యువతను సిద్ధం చేయాలని అంటున్నారు.