ఆ ఆరు గ్రామాలకు ఎవరూ వెళ్లొద్దు.. కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ఏపీలో కరోనా కల్లోలం రేపుతూనే ఉంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు ఆరున్నర లక్షలు దాటాయి. అయితే ఏపీలో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలో కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. అయితే కాలం గడిచే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. మళ్ళీ కొద్దీ రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లాలో తాజాగా 6 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కరోనా వ్యాప్తి నిరోధించడానికి వీటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు. ఈ కంటైన్మెంట్ జోన్లలోకి బయటి వారు ఎవరూ వెళ్లకూడదు... అలాగే కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారు కూడా బయటకు రాకూడదు. అయితే వీరికి సంబంధించిన నిత్యావసర సరుకులు, మిగిలిన అవసరాలు అన్నీ స్థానికంగానే అందుబాటులో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం చూస్తుందని అయన తెలిపారు.

 

తాజాగా కృష్ణా జిల్లాలో కొత్త కంటైన్మెంట్ జోన్ల వివరాలు

1. అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామం
2. చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం గ్రామం
3. చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామం
4. గూడూరు మండలంలోని షబ్ధుల్లపాలెం గ్రామం
5. జగ్గయ్యపేట మండలంలోని తొర్రగుంటపాలెం గ్రామం
6. విస్సన్నపేట మండలంలో కోర్లమంద గ్రామం

 

ఇదే సమయంలో గత 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ల నిబంధనలను తొలగించినట్లుగా కలెక్టర్ తెలియజేశారు.

1. ఘంటసాల మండలంలో కొడాలి గ్రామం
2. గుడ్లవల్లేరు మండలంలో పురిటిపాడు గ్రామం
3. గుడివాడ మండలంలో దొండపాడు గ్రామం
4. మచిలీపట్టణం మున్సిపలిటీలో టీచర్స్ కాలని
5. మచిలీపట్నం మండలంలో మంగినపూడి గ్రామం
6. నందిగామ మండలంలో ఐతవరం గ్రామం
7. మైలవరం మండలంలో దాసుళ్ళపాలెం గ్రామం
8. రెడ్డిగూడెం మండలంలో శ్రీరాంపురం గ్రామం
9. రెడ్డిగూడెం మండలంలో ముచ్చినపల్లి గ్రామం