TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏదీ తేల్చని రాజధాని నివేదిక?

Published on: Wed Aug 27, 2014 4:41PM

 

ఆంద్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈరోజుగానీ, గురువారం గానీ ఈ నివేదికను కమిటీ కేంద్ర హోంశాఖకు సమర్పించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏర్పాటు ఏ ప్రాంతంలో అయితే బాగుంటుందన్న అంశం మీద కమిటీ అనేక ప్రతిపాదలను పరిశీలించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించింది. అయితే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఫలాచా చోట పెట్టండి’ అని స్పష్టంగా చెప్పలేదని తెలుస్తోంది. శ్రీకృష్ట కమిటీ నివేదిక తరహాలోనే శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే లాభాలేంటి, నష్టాలేంటని మాత్రమే చెప్పిందని, రాజధాని విషయంలో పలు ప్రతిపాదనలు చేసిందని తెలుస్తోంది.