TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శివసేన కార్యాలయం మూత

Published on: Sun Jul 3, 2022 7:43PM

మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయం మూతపడింది. థాకరే నేతృత్వంలోని వర్గం, షిండే నేతృత్వంలోని వర్గం కూడా అసలైన శివసేన తమదంటే తమదని చెపుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోని శివసేన కార్యాలయానికి ఆదివారం సీల్ వేశారు. సీల్ వేసిన కార్యాలయం బయట శివసేన లెజిస్లేటివ్ పార్టీ ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేసినట్లు నోటీసు అతికించారు.

సలైన శివసేన తమదేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెండో వర్గం క్లెయిమ్ చేస్తుండటంతో మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి ఆదివారంనాడు సీల్ వేశారు. కార్యాలయం వెలుపల నోటీసు అంటించారు. ''శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేశాం'' అని ఆ నోటీసు ;పెట్టారు.  

కాగా   షిండే వర్గం నేతలు తాము శివసేనను విడిచి పెట్టలేదని, మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నందున తమదే అసలైన శివసేన అని చెబుతుంటే.. షిండే వర్గం వాదన చెల్లదని, పార్టీ లోగో, గుర్తింపు పొందిన ధనుస్సు, బాణం గుర్తు వారికి ఎంతమాత్రం చెందదని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదిస్తోంది.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కిషోర్ తివారి సహా పలువురు పార్టీ నేతలు ఇదే విషయంపై ఢంకా బజాయిస్తున్నారు. ఎవరుపడితే వారు వెళ్లిపోవడం, పార్టీని తన్నుకుపోవడం అంత సులభం కాదని, చాలా లీగల్ అంశాలు కూడా ముడిపడి ఉంటాయని  అంటున్నారు. ఇరు వర్గాల మధ్యా వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలోని శివసేన కార్యాలయానికి సీలు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.