TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

Published on: Sat Oct 25, 2025 4:21PM

 

కర్నూలు జిల్లా చిన్నటేకూరులో వి. కావేరి బస్సు దగ్ధ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బస్సు, బైక్ ప్రమాదాలు వేర్వేరుగా జరిగినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే— బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్, ఎర్రిస్వామి హైవేపై ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో శివశంకర్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 

వెంటనే రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తుండగా, చీకట్లో వేగంగా వస్తున్న వి. కావేరి బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లింది.దీంతో బైక్ పెట్రోల్ ట్యాంకు లీక్ అయి మంటలు చెలరేగాయి. దీని వల్ల పెట్రోలు లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయని ఎర్రిస్వామి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

 ప్రమాదానికి ముందు శివశంకర్ మరో యువకుడితో కలిసి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోలో శివశంకర్ మత్తుతో తూలుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ దారుణం రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.