TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ ను విచారించనున్న సిట్?.. నోటీసులు ఇచ్చేందుకు ఫామ్ హౌస్ కు అధికారులు

Published on: Thu Jan 29, 2026 11:48AM

 తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఎర్రవల్లి ఫామ్ హౌస్ తలుపు తట్టింది. ఈ కేసు దర్యాప్తులో  దూకుడు పెంచిన సిట్ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు ఇచ్చి విచారించాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ ను విచారణకు పిలవడం కాకుండా సిట్ అధికారులే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనను విచారించే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ కు గురువారం (జనవరి 29) సాయంత్రంలోగా నోటీసులు ఇచ్చి శుక్రవారం (జనవరి 30) విచారించనున్నది.  ఇప్పటికే ఈ కేసులో  మాజీ మంత్రులు, కీలక నేతలను విచారించిన సిట్ ఇప్పుడు ఏకంగా మజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనుండటం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

 ఈ కేసులో సిట్ ఇప్పటికే   మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను విచారించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మాజీ ఎంపీ, కేసీఆర్ కు సన్నిహితుడు అయిన సంతోష్ రావును కూడా విచారించింది.  వారి విచారణలో బయటపడిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్ ను విచారించాలని సిట్ నిర్ణయించిందని అంటున్నారు.  కేసీఆర్ ను సిట్ విచారించనుందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కేసీఆర్ ను సిట్ విచారించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఆరోపిస్తున్నారు.