TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్!?

Published on: Thu Aug 21, 2025 1:11PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసులో కీలక నిందితుడు, ప్రస్తుతం అరెస్టై విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది.

అక్రమ మద్యం వ్యాపారంతో భారీగా కూడబెట్టిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలిన నేపథ్యంలో ఆయన ఆస్తులను సీజ్ చేయాలని ఏపీ సర్కార్ అదేశించింది. దీంతో సిట్ బెజవాడ ఏసీబీ కోర్టులో ఆస్తుల జప్తునకు పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతోంది.  దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నది.