జగన్ పార్టీలోకి చిరంజీవి అల్లుడు?
Published on: Mon May 14, 2012 1:38PM
ప్రముఖ నటుడు రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి రెండో అల్లుడు శిరీష్ భరద్వాజ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డితో శిరీష్ భరద్వాజ్ ఆదివారం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో శిరీష్ జగన్ పార్టీ వైపుకు వెళ్లేందుకే ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు. కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జోరుగా వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి పలువురు నేతలు జగన్ పార్టీలోకి చేరుతున్నారు. చిరంజీవికి చెక్ పెట్టేందుకు శిరీష్ భరద్వాజ్‌ను కూడా తమ పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరుతో శిరీష్ కు విభేదాల నేపథ్యంలో ఆయనను తీసుకుంటే రాజకీయంగా మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారట.


