TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రఘుతో హరి నిశ్చితార్థం

Published on: Thu Feb 13, 2014 4:38PM

 

యువ గాయకుడు రఘురాం త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి హరితేజ తో రేపు నిశ్చితార్థం జరగనుంది. గతకొద్దికాలంగా ప్రేమించుకున్న వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో ప్రేమికులరోజు ఫిబ్రవరి 14న నిశ్చితార్థం చేసుకోనున్నారు. రఘురాం గాయకుడిగా పలు సినిమా పాటలు పాడాడు. ఇటీవలే "మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో" చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. అదే విధంగా హరితేజ పలు సీరియల్స్ లో నటిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలకు యాంకరింగ్ కూడా చేస్తుంది. "దమ్ము", "అత్తారింటికి దారేది" వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.