TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగర్ బండి సంజయ్!

Published on: Thu Mar 26, 2026 2:02PM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లో రాజకీయ నాయకుడే కాకుండా ఒక  గాయకుడు కూడా ఉన్నాడు. బండి సంజయ్ అంటే ఇప్పటి వరకూ అందరికీ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ ఉండటమే అందరికీ తెలుసు. కానీ ఆయనలో ఒక మంచి గాయకుడు కూడా ఉన్నాడని ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది.  ఆర్ ఎస్ ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ గీతాలను  శుక్రవారం (మార్చి 27) ఈ గీతా లను విడుదల చేయను న్నారు. ఆర్ఎస్ఎస్  శత వసంతాలు పూర్తయిన నేపథ్యంలో బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు.  

జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్న బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసు కువెళ్లాలన్న లక్ష్యంతో ఈ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాలాపన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో   వైరల్ గా మారింది.  నేటిజనుల నుండి మంచి స్పందన వచ్చింది.

శుక్రవారం (మార్చి 27)  శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్లో బండి సంజయ్ పాడిన ఈ పాటలను అధికారికంగా విడుదల చేయనున్నారు.. మొత్తానికి బండి సంజయ్  ఒక రాజకీయ నాయకుడి గానే కాక గాయకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, స్వరం బాగుందంటూ నేటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు