TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి షాక్...

Published on: Thu Mar 16, 2017 12:11PM

 

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు తప్పుబట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వారసత్వ ఉద్యోగాల నియామకాలపై గోదావరిఖనికి చెందిన సతీష్‌ కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. దీనిపై విచారించిన కోర్టు వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ను రద్దుచేసింది. అర్హులకు మాత్రమే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని..కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి వారసత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని.. అనారోగ్యంతో ఉండి కుటుంబంలో ఆధారం లేకపోతే ఉద్యోగం ఇవ్వొచ్చని ఆదేశించింది.