TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ.. సెమీస్ కు దూసుకెళ్లిన తెలుగుతేజం సింధూ.. ఎలాగంటే?

Published on: Fri Jul 17, 2026 11:52AM

టోక్యో వేదికగా జరుగుతోన్న  జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు  సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా సెమీస్‌లోకి ప్రవేశించచింది.  

క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది.   అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా  సెమీస్ బెర్త్‌  ఖరారు అయిపోయింది. 

 గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సింధుకు, ఈ టోర్నీ అత్యంత కీలకమైనదని చెప్పాలి.  ఇక  2023లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ తర్వాత   ఒక సూపర్ 750 టోర్నమెంట్‌లో సెమీఫైనల్ చేరడం సింధూకు ఇదే మొదటిసారి.  సెమీఫైనల్‌ లో సింధు..   చైనాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్, స్టార్ షట్లర్ చెన్ యుఫెయీతో తలపడాల్సి ఉంది. వీరిద్దరూ ఇప్పటివరకు 14 సార్లు  ముఖాముఖీ తలపడగా..  చైనా క్రీడాకారిణి యుఫెయీ 8 సార్లు, సింధు  6 సార్లు విజయం సాధించారు.  

  పీవీ సింధు, చెన్ యుఫెయీ మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌లలో చైనా షట్లర్‌దే   పైచేయి. వరుస ఓటములతో వెనుకబడిన సింధు, ఈసారి ఎలాగైనా యుఫెయీని ఓడించి ఫైనల్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింధు ఒక సూపర్ 750 సిరీస్ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడే అర్హత సాధించినట్లౌతుంది. 

Japan Open, Badminito, 1sttime, After Three Years, Telugu News