Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిర్మాతగా సిమ్రాన్
posted on: Apr 4, 2015 5:19PM

దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాలు చేసి తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుని, కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. సినిమా నిర్మాణ సంస్థను స్థాపించానని తానే స్వయంగా ఒక ప్రకటన ద్వారా చెప్పారు. 'సిమ్రాన్ అండ్ సన్స్' పేరుతో బ్యానర్ ని ప్రారంభించామని, ఈ బ్యానర్ ద్వారా సంవత్సరానికి రెండు సినిమాలు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. సినిమాలపై తనకున్న అభిమానమే సినిమా నిర్మాణ రంగంపై దృష్టి పెట్టేలా చేసిందని అన్నారు.






