TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అబ్బే.. అదేం లేదు.. ఉమ్మా...

Published on: Tue Feb 4, 2014 9:02AM

 

రాజకీయాల్లో ప్రతిరోజు ఎదో ఒక మార్పు వస్తూనే వస్తుంది. అదే విధంగా ప్రేమికుల్లో కూడా ప్రతిరోజు ఎదో ఒక మార్పు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శింబు, హన్సిక ప్రేమ కూడా ఇలాగే నడుస్తుంది. అందరు ఉన్నప్పుడు మాత్రం "టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను" అంటూ మాట దాటివేస్తుంది హన్సిక. శింబు కూడా "నాకేం సంబంధం లేదు" అన్నట్లుగా ఉంటున్నాడు. మరి వీరిద్దరూ మళ్ళీ కలుస్తారో లేదో అని కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. అయితే వీరు మాత్రం రహస్యంగా కలుసుకుంటూ వారి ప్రేమను మరింతగా పెంచేసుకుంటున్నారు. సోమవారం శింబు పుట్టినరోజు.. ఆదివారం రాత్రి 12గంటలకు కేక్ కట్ చేసాడు శింబు. కానీ ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ సరిగ్గా కేక్ కటింగ్ సమయానికి హన్సిక అక్కడికి చేరుకొని ప్రియుడిని సంతోషపెట్టింది. వీరిద్దరూ కూడా ఈ పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేసారని తెలిసింది. ఏం లేదంటూనే వీళ్ళు ఇలా ప్రేమలో ముద్దు, మురిపాలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.