1 కాదు.. 2 కాదు.. 70 కిలోల వెండి
Published on: Sat Aug 2, 2014 1:25PM

మొన్నటి వరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ కేసులు ఎక్కువగా దొరికాయి. ఇప్పుడు ఆ స్మగ్లింగ్ డ్యూటీని వెండి స్మగ్లర్లు చేస్తున్నట్టున్నారు. శనివారం నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి 70 కేజీల వెండిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ఆమె లగేజీని అధికారులు తనిఖీ చేయగా లగేజీలో భారీగా వెండి ఆభరణాలు కనిపించాయి. వెండి ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


