400 అడుగుల టవర్‌పై.. 560 రోజులు భక్తుడు నిరసన ఎందుకంటే?
Published on: Sat Apr 25, 2026 5:29PM

400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు, మాజీ సైనికోద్యోగి గుర్జీత్ సింగ్ ఖల్సా తమ మత గ్రంథానికి అపవిత్రం చేసే వారిని కఠినంగా శిక్షించాలని చేపట్టిన నిరసన ఎట్టకేలకు ఫలించింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2024 అక్టోబరు 12న నమనాలో ఉన్న టవర్ ఎక్కారు గుర్జీత్ సింగ్. ఆయనకు మద్దతుదారులు కింద నుంచే ఆహారం పంపేవారు.
టవర్ పైభాగంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టార్పాలిన్ షెల్టర్‌లో ఉంటూ కాలకృత్యాలకు పాలిథీన్ కవర్లను ఉపయోగిస్తూ గుర్జీత్ తన సుదీర్ఘ నిరసన కొనసాగించారు. దాంతో పంజాబ్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గురు గ్రంథ్ సాహిబ్ పట్ల అగౌరవంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా ‘ద జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్’ పేరుతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతో 18 నెలల 12 రోజుల నిరసనను విరమించుకున్న గుర్జీత్ సింగ్ ఖల్ఫా టవర్ దిగారు. సంకల్ప బలం అంటే అదేనేమో.


