Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువేనట..!
posted on: Feb 19, 2026 2:49PM

ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు. తమ జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు. కొందరు మాత్రం ఇలాంటి మాటలు విన్నప్పుడు అదేదో కామెడీ అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు. మనిషి వ్యక్తిత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అయితే మనిషిలో ఉండే లక్షణాలను బట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందనేది చెప్పవచ్చట. సెల్ప్ రెస్పెక్ట్ లేకపోతే.. ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇంతకీ మనుషుల్లో ఏ లక్షణాలు ఉంటే అవి వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తాయి? సెల్ప్ రెస్పెక్ట్ తక్కువ ఉందని ఏ లక్షణాలు సూచిస్తాయి? మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే..
తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడం..
తప్పు లేకుండా క్షమాపణ చెప్పడం లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అపరాధ భావన కలిగి ఉండటం.. తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉన్నారని సూచిస్తుందని మనస్తత్వవేత్తలు అంటున్నారు. నిజంగా ఎవరికైనా హాని చేశారా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. ఎవరికి ఎలాంటి హాని చేయకపోతే ధైర్యంగా, నమ్మకంతో నిలబడాలని చెబుతున్నారు.
తక్కువ చేసి మాట్లాడే వారి ముందు..
ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. కుటుంబ సభ్యులు లేదా లైఫ్ పార్ట్నర్.. స్నేహితులు, ఇతరులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే.. వారి మాటలను అంగీకరించినట్టే.. ఇలా చేస్తే తమను తాము తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఫెయిల్యూర్..
తమను తాము ఫెయిల్యూర్ పర్సన్ గానూ, తెలివి తక్కువ వారి గానూ భావించే వారికి సెల్ప్ రెస్పెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారు తమకు తాము హాని చేసుకుంటారని అంటున్నారు.
ప్రశంసలు, భరోసా..
ఎప్పుడూ తమను ఎవరో ఒకరు పొగుడుతూ, మెచ్చుకుంటూ, భరోసా ఇస్తూ తమ వెంట ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందట. మెచ్చుకోలు, భరోసా లోపించినప్పుడు తాము వేస్ట్ అనుకునే మెంటాలిటీ వీరిలో ఏర్పడుతుందట. ఇది ఎమోషనల్ గా తమను తాము దెబ్బతీసుకోవడానికి దోహదం చేస్తుందట.
ఇతరుల కోసం..
ఇతరుల కోసం బాధపడటం, అన్నం తినడం మానేయడం, ఇతరుల కోసం తమను తాము హింసించుకోవడం, ఇతరుల ముందు తమను తాము తక్కువ చేసుకోవడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఈ హద్దులను నిర్ణయించుకోలేని వారు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ కలిగి ఉంటారు.
బంధాలు..
తెలిసో, తెలియకో.. బంధాలు ఏర్పడిపోతాయి. అయితే ఒక చెడు బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి మారతారనే ఆశతో బాధ కలిగించే విషయాలను మభ్యపుచ్చుకోవడం, భరించడం అనేది సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉందని సూచిస్తుంది. అవతలి వ్యక్తి తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పకపోగా, తమదే తప్పు అని అంగీకరించే వారు సెల్ప్ రెస్పెక్ట్ చాలా తక్కువ కలిగి ఉంటారు.
పోలిక..
ఇతరులతో పోల్చుకునే వారు కూడా తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.
సెల్ప్ కేర్..
సెల్ప్ కేర్ ఎంత ఎక్కువ ఉంటే వారు అంత సెల్ప్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉంటారు. చాలామందిలో సెల్ప్ కేర్ అనేది ఉండదు. తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి, వారి కోసం అన్నీ చేసి, కష్టపడి.. వారు మెచ్చుకుంటే ఆ మాటలతోనే తృప్తి పడుతుంటారు. అయితే ఇది చాలా తప్పు. తమ గురించి తాము కేర్ తీసుకోని వ్యక్తులు తమను తాము ఇతరుల ముందు రెస్పెక్ట్ గా నిలబెట్టుకోలేరు.
*రూపశ్రీ.






